పని యెడల బైబిలు పరమయిన దృష్టి విధానము

వివాహము దేవుని యొక్క ఆలోచన అని మేము నమ్ముతాము, కాబట్టి మేము వివాహమందు ఆనందిస్తాము. సంఘము దేవుని ఆలోచన అని మేము తెలుసుకున్నాము, కాబట్టి మేము సహవాసమునందు ఆనందిస్తాము. శుభవార్త ఏమిటి అంటే పని కూడా దేవుని ఆలోచనే. దేవుడే దాన్ని స్థాపించాడు! కాబట్టి , పని యందు ఆనందించండి!