క్రీస్తు నందు మనమెవరము

క్రొత్త నిబంధనలో ఒక ప్రాముఖ్యమైన ప్రత్యేక్షత ఏమిటి అంటే మనము క్రీస్తులో నూతన సృష్టి కొరకైన సత్యం. దాదాపు 130 క్రొత్త నిబంధన వచనములతో క్రీస్తులోని విశ్వాసులుగా దేవుడు మన కొరకు చేసినది మరియు మనకు ఇచ్చిన ఈ ప్రాముఖ్యమైన సత్యమును ఒక విశ్వాసి తప్పక పొందుకోవాలి మరియు దానిలో నడవాలి. క్రీస్తు నందు మనమెవరము అనేది నిజానికి మనము ఏమైయున్నాము అనే దానిని తెలియజేస్తుంది. క్రీస్తునందు జీవించడమే దేవుని యొక్క మహిమను జీవితములో కనపరచడానికి సూత్రము.