మీ పిలుపు విషయంలో రాజీపడవద్దు

మనమందరం, 'గొప్ప' లేక 'చిన్న' వాటిని చేయుటకు పిలువబడినను దేవుని పిలుపును నెరవేర్చకుండునట్లు మనలోని నిరోధించే సవాళ్లను ఎదుర్కొంటాము. మార్గమధ్యమున ఎక్కడో ఒకచోట జీవిత వ్యవహారాలలో చిక్కుకొని లేక విజయాన్ని , ఐశ్వర్యాన్ని లేక వ్యక్తిగత అభిలాషలను వెంబడించుటలో మన శక్తిని వ్యయపరుస్తూ మనము దారి తొలగిపోయి ఉండవచ్చు. మనకు అనుగ్రహింపబడిన ప్రభువు వాక్యము, పరిశుద్దాత్ముడిచ్చిన కలలు మరియు దర్శనములు ఒక మూలకు పడవేయబడి యుండవచ్చు. అయితే దేవుని పిలుపుకు స్పందించడానికి మనల్ని ప్రేరేపించుటే ఈ పుస్తకము యొక్క ఉద్దేశం . మంచి పోరాటమును పోరాడి మన ముందు ఉన్న పరుగు పందెమును కడముట్టించుదాం.