మార్పు

మన క్రైస్తవ జీవితం పశ్చాతాపం ద్వారా మొదలవుతుంది, ఏది అయితే హృదయము మరియు మనస్సు మార్పుకై అవసరమై, పాపము మరియు సాతాను నుండి జీవముగల దేవుని యొద్దకు నడిపించేది. ఆ సమయంలో దేవుడు మనలోని అంతర్గతముగా మార్పును కలుగజేసారు, మనము తిరిగి జన్మించినవారమయ్యాము! మనము క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడ్డాము. తక్షణమే దేవుడు మన ఆత్మలో ఒక సృజనాత్మక కార్యము చేసారు ఏదైతే మనలను చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకువచ్చిందో మరియు సాతాను బంధకముల నుండి క్రీస్తులో స్వాతంత్రులుగా మార్చిందో. క్రీస్తులో మన జీవితం ఒక తక్షణ మార్పుతో మొదలవుతుంది మరియు అది ఉన్నతమైన మార్పుతో చేరుకుంటుంది. ఏది ఏమైనప్పటికి ఈ రెండిటి మధ్య నిరంతరం మారె ఒక పద్దతి ఉన్నాది. ఈ పుస్తకం ప్రధమంగా ప్రేరేపణ కలుగజేసేది మరియు మార్పునకు అవసరమైన పద్దతిలో మనలను నిరంతరము ఉత్తేజపరచుతుంది.