సమర్పణ యొక్క శక్తి

ఈ ప్రస్తుత ప్రపంచంలో , సమర్పణ అనే గుణం చాల అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. చాల మంది అనువుగా ఉన్న పని చేయడానికి ఇష్టపడతారు దాని ద్వారా నిజమైన సమర్పణ కలిగిన వారిని కనుగొనడం కష్టం. సమర్పణ అనేది ఒక క్రమశిక్షణ. అది మనం అలోచించి ఎంపిక చేసుకునేది. బైబిల్ మనకు సమర్పణ కలిగి ఉండమని బోధిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు "ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగా నుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు" (మత్తయి 6:24). యేసు, సమర్పణ మన యొక్క స్వాభావికం అని సూచిస్తున్నారు. మానవుడు ఎన్నడు పరస్పర వ్యతిరేకమైన రెండు బాధ్యతలు కలిగి ఉండలేడు. ఈ పుస్తకం సమర్పణ యొక్క శక్తి కోసం ఉద్ఘాటించి చెప్తుంది మరియు మీరు చేస్తున్న ప్రతి పనిలో సమర్పణ కలిగి ఉండడానికి ప్రేరేపిస్తుంది. సమర్పణ కలిగి ఉండాల్సిన సమయం ఇదే !